Entha pedda poratamo

ఎంత పెద్ద పోరాటమో
అంత పెద్ద విజయమో (2)
పోరాడతాను నిత్యము
విజయమనేది తథ్యము (2)


వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు (2)          ||ఎంత||


ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు (2)          ||ఎంత||


యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు (2)