ప్రేమ తో నిన్ను ఆరాధించే దను

ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్య 1.మేఘస్తంభమై యున్నానంటివే - అగ్ని స్తంభమై యున్నానంటివే శ్రమ వెంబడి శ్రమలొచ్చినా - నిన్ను విడువను మరువనంటివే 2.కన్నతల్లివలె ఆదరించితివే - కన్నతండ్రివలె జాలిచూపితివె కన్నవారైనా నిన్ను మరచిన - కరుణచూపి నిన్ను మరువనంటివే 3.నీ చేతిలో చిక్కుకొంటివే - నీ సాక్షిగా నిలుపుకొంటివే నిందలొచ్చినే నీరసిల్లిన - నీ ఆత్మతో ఆదరించితివే కృతజ్ఞతతో స్తుతిపాడెద - నా యేసు నాధా నాకై నీవు చేసిన - మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు 1.నిజరక్షకుడు యేసు క్రీస్తని - విశ్వసించేద అనునిత్యము నీ పాద సేవలో బ్రతుకుటకై - నీ వరము ప్రసాదించుము 2.అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన - కృపామయ నా ఊహలకంటెను అధికముగా - దయచేయు ప్రేమమయ