A stalamandiana telugu jesus song written by daniel akumurthy

A stalamandiana telugu jesus song written by daniel akumurthy


wonderfull famous. christian song sung by brother praveen Music guitar by baby akshaya
 ఏ సమయమందైనా ఏ స్తలమందైనా
ఏ సమయమందైనా ఏ స్తలమందైనా
ఏ స్థితిలో నేనున్నాస్తుతి పాడేదన్
ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రిస్తుకే ఆరాధనా
గొర్రెపిల్ల క్రిస్తుకే ఆరాధనా

చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా
కరువు ఖడ్గము హింస ఎదైననూ
మరణ శాసనమే పొంచున్ననూ

యేసు నామమే ఆధారము కాదా
యేసు రక్తమే నా విజయము
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో
కునుకక కాపాడు యేసు దేవునికే

ఏ సమయమందైనా ఏ స్తలమందైనా
ఏ స్థితిలో నేనున్నాస్తుతి పాడేదన్
ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రిస్తుకే ఆరాధనా
గొర్రెపిల్ల క్రిస్తుకే ఆరాధనా

నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రిస్తుడే
తన చేతులతో  నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్

యెహోవా రాఫా నను స్వస్థ పరిచెను
యెహోవా షమ్మా నాకు తోడుగా
యెహోవా నిస్సీ నా ధ్వజముగా
ఆల్ఫా ఒమేగా ఆది దేవునికే
Powered by Blogger.