2021 Hebron Moto songs

2021 Hebron Moto songs

 
అతడు నన్ను ప్రేమించుచున్నాడు
గనుక నేనతని తప్పించెదను
అ.పల్లవి:-
నన్ను ప్రేమించి నా కొరకు తన్నుతాను 
అప్పగించుకొనిన దేవుని కుమారుడు
దేవుడు తన్ను ప్రేమించువారికొరకు
ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు

చరణం:-

నా విశ్వాసతయు కృపయు అతనికి తోడైయుండును
నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును

చరణం:-

నను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను
నను జాగ్రత్తగా వెదకువారు నను కనుగొందురు

చరణం:-

యెహోవానైన నా నామము బలమైన దుర్గము
నాయందు నమ్మికయుంచువాడు సురక్షితముగానుండును

చరణం:-

పర్వతములలోని శిలలు అతనికి కోటయగును
ఆహారమును నీళ్ళను అతనికి శాశ్వతముగా నుండును

చరణం:-

ఆపద దినమునందు అతనిని విడిపింతును
రాజుల సంస్థానములలో హెచ్చించు దేవుడను నేనె

Powered by Blogger.