సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు తెలుగు సాంగ్ 2021

# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords# 
సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు
నీవే నా బలం నీవే నా నమ్మకం         ॥ 2 ॥

గడచిన కాలము నాతో వున్నావు
నేడు నాతోడు నడుచుచున్నావు
సదా నాతోనే వుంటావు........

ఎగసిపడే తుఫాను ల్లో 
నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే  అలలెన్నైనా 
అవి నీ పాదముల క్రిందనే                 ॥ 2 ॥

వ్యాదినను చుట్టినా  లెమ్మని సెలవిచ్చెదవు
యెహోవా రాఫా నీవే నా స్వస్థత             ॥ 2 ॥
                                        ॥ గడచిన...॥

ఓ వ్యాధి నీ శిరస్సు ఒంగెనే 
నాపై నీ అధికారం చెల్లదే
రూపింపాబడిన ఏ ఆయుధం 
నాకు విరోధముగా వర్ధిల్లదూ.........
 ॥ ఎగసిపడే ॥