krotha yedu song john bilmoria

 క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు

క్రొత్త యేడు మొదలు బెట్టెను

క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ

తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ         ||క్రొత్త||

పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర

డెందమందు స్మరణ జేయుడి

ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు

అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా        ||క్రొత్త||

బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు

కలిమి మీర గర్త వాక్కున

అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది

బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ            ||క్రొత్త||

పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు

ప్రాపు జేరి మీరు వేడగా

సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి

పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు                       ||క్రొత్త||